Kumbhmela: కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం... పరుగులు పెట్టిన భక్తులు!

fire breaks out at mahakumbh uttar pradesh prayagraj

  • అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్న మహా కుంభమేళా
  • గంగానది తీరం వెంట టెంట్ సిటీలో ప్రమాదం
  • సిలిండర్లు పేలడంతో దగ్ధమైన గుడారాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో గంగానది తీరం వెంట ఏర్పాటు చేసిన టెంట్ సిటీలో ఈ ఘటన జరిగింది. గుడారాల్లో వంట కోసం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. 

సమీపంలోని గుడారాలకు ఈ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే గుడారాల వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

పరుగులు తీసిన భక్తులు
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలోని టెంట్ సిటీ 19వ సెక్టార్ లో ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం, ఒక్కసారిగా మంటలు, నల్లటి పొగ కమ్ముకోవడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. సుమారు 15 నుంచి 18 గుడారాలు పూర్తిగా దగ్ధమైనట్టు భావిస్తున్నారు.

భక్తులను తరలించిన పోలీసులు
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఆ చుట్టుపక్కల గుడారాల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొలుత గీతాప్రెస్‌ కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయని... ప్రాణనష్టం జరిగినట్లు సమాచారమేదీ లేదని మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలు, నష్టం వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. 

Kumbhmela
Uttar Pradesh
Prayagraj
Fire Accident
national
Viral News
X Corp
Twitter
  • Loading...

More Telugu News