offbeat: వాహనాలకు ఎరుపు, నీలం రంగు నంబర్​ ప్లేట్లు!

different types of number plates in india

  • ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ తో ప్లేట్లు తప్పనిసరి
  • తెలుపు, పసుపు రంగు నంబర్ ప్లేట్లు మనకు తెలిసినవే...
  • మరి ఎరుపు, నీలి రంగు, నల్లటి నంబర్ ప్లేట్లు ఏ వాహనాలకు ఉంటాయో తెలుసా?


మన దేశంలోనే కాదు... ప్రపంచంలో ఎక్కడైనా వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరి. సదరు వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రవాణా శాఖ వాటికి ఒక నంబర్ ను కేటాయిస్తుంది. ఈ నంబర్ ను వాహనానికి ముందు, వెనుక వైపుల నిర్దిష్టంగా కనిపించేలా ఉంచాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే ఆయా వాహనాల వినియోగాన్ని బట్టి వాటి నంబర్ ప్లేట్లకు వేర్వేరు రంగులు ఉంటాయన్నది మీకు తెలుసా?

తెలుపు రంగు నంబర్ ప్లేట్లు...
ఇవి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వ్యక్తిగతంగా వినియోగించే ప్రైవేటు వాహనాలకు తెలుపు రంగు నంబర్ ప్లేట్లు, వాటిపై నలుపు రంగులోని అక్షరాలు ఉంటాయి.

పసుపు రంగు నంబర్ ప్లేట్లు...
వ్యక్తిగతంగా కాకుండా... వాణిజ్య, వ్యాపార పరంగా వినియోగించే వాహనాలకు పసుపు రంగు నంబర్ ప్లేట్లు, వాటిపై నలుపు రంగు అక్షరాలు ఉంటాయి. ట్యాక్సీలు, బస్సులు, ట్రక్కులపై మనం వీటిని చూడవచ్చు.

ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు...
పర్యావరణానికి హాని కలిగించని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) కోసం ప్రత్యేకించిన నంబర్ ప్లేట్లు ఇవి. వీటిలో ఆకుపచ్చ నంబర్ ప్లేట్లపై తెలుపు రంగు అక్షరాలు ఉంటాయి.

ఎరుపు రంగు నంబర్ ప్లేట్లు...
దేశంలోని దౌత్యవేత్తలు, దౌత్య కార్యాలయాలు వినియోగించే అధికారిక వాహనాలపై ఎరుపు రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి. మన దేశంలో ఉండే విదేశీ దౌత్యవేత్తల వాహనాలకు వీటిని అమర్చుతారు. వెహికల్ చెకింగ్, పలు ఇతర అంశాల నుంచి వీటికి మినహాయింపు ఉంటుంది.

నీలి రంగు నంబర్ ప్లేట్లు...
మన దేశంలో తిరిగే విదేశీ అధికారిక ప్రతినిధులు, కాన్సులేట్లు, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన వాహనాలకు నీలి రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి. వీటికి కూడా పలు అంశాల నుంచి మినహాయింపు ఉంటుంది.

నలుపు రంగు నంబర్ ప్లేట్లు...
మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వీవీఐపీలు, ప్రత్యేక భద్రత కలిగి ఉన్న వ్యక్తుల వాహనాలకు నలుపు రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే... ప్రముఖుల వాహనాలు అన్నమాట.

బాణం గుర్తులతో కూడిన నంబర్ ప్లేట్లు...
కొన్ని వాహనాలపై పైకి చూపిస్తున్న బాణం గుర్తుతో కూడిన నంబర్ ప్లేట్లు ఉంటాయి. అవన్నీ భారత సైనిక దళాలకు సంబంధించిన వాహనాలు అన్నమాట. దేశంలో ఎక్కడైనా సరే ఈ వాహనాలకు వేరేగా నంబర్ ప్లేట్లు, విభిన్నమైన నంబర్లు ఉంటాయి. కేవలం సైనిక వాహనాలకే ఈ ప్రత్యేకత ఉంటుంది.

ఎరుపు రంగు నంబర్ ప్లేట్‌ పై నాలుగు సింహాల బొమ్మ...
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న అత్యంత ప్రముఖుల వాహనాలకు ఎరుపు రంగు నంబర్ ప్లేట్ దానిపై భారత అధికారిక చిహ్నమైన నాలుగు సింహాల బొమ్మ ఉంటాయి. దేశంలోనే అత్యంత ప్రముఖులు అన్నదానికి ఇది చిహ్నం.

offbeat
india
Number plates
Viral News
information
  • Loading...

More Telugu News