Sankranthiki Vasthunam: రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ’సంక్రాంతికి వ‌స్తున్నాం‘.. ఐదు రోజుల్లో రూ.161 కోట్లు

Sankrantiki Vastunnam Record Collections

  • సంక్రాంతికి వస్తున్నాం ఐదు రోజుల్లో రికార్డు కలెక్షన్స్
  • వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అంటున్న మూవీ మేకర్స్
  • శనివారం ఒక్కరోజే రూ.31 కోట్లు రాబట్టిన సినిమా 

విక్టరీ వెంకటేశ్ తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను మూటగట్టుకుంటోంది. వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టిందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

శనివారం ఒక్కరోజే ఈ సినిమా రూ.31 కోట్లను కలెక్ట్ చేసిందని, ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఐదు రోజుల్లో రూ.161 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అధికారికంగా వెల్లడించింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది.

View this post on Instagram

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

Sankranthiki Vasthunam
Victory Venkatesh
Venky Mama
Five Days Collections
Movie Collections
  • Loading...

More Telugu News