Amit Shah: ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ... తిరుమల తొక్కిసలాట ఘటన సహా పలు అంశాలపై చర్చ

- దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం
- హైందవ శంఖారావం సభ విజయం పట్ల అభినందనలు
- ఏపీకి కేంద్రం చేస్తున్న సాయాన్ని ప్రజలకు వివరించాలని సూచన
తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. విజయవాడ నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది.
వివిధ అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. 'హైందవ శంఖారావం' సభ విజయం పట్ల పార్టీ, విశ్వహిందూ పరిషత్ నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశనం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హితవు పలికారు.