Iran: ఇరాన్ లో ఘోరం... సుప్రీం కోర్టు జడ్జీల కాల్చివేత

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఘోరం జరిగింది. సుప్రీంకోర్టు ఆవరణలో సాయుధ దాడి జరిగింది. ఈ దాడిలో దుండగుడు ఇద్దరు జడ్జీలను కాల్చిచంపాడు. దీంతో మొహమ్మద్ మొగిషు, హోజతొలెస్లామ్ అలీ రైజిని అనే జడ్జీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో గాయపడ్డ మరో జడ్జి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, కాల్పులకు పాల్పడిన తర్వాత దుండగుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడికి చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.