Uttam Kumar Reddy: రేషన్ కార్డుల జారీ అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Uttam Kumar Reddy key announcement on ration cards

  • రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్న మంత్రి
  • కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాకుంటే ఆందోళన వద్దన్న మంత్రి
  • అర్హులైన వారు గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచన

రేషన్ కార్డుల జారీ అంశంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలోని అర్హులందరికీ కార్డులు ఇచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే వివరాల ఆధారంగా, పాత రేషన్ కార్డుల సమాచారం ప్రకారం అర్హుల పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. అర్హులైన వారికి ఎవరికైనా కార్డులు రాకుంటే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News