Gudivada Amarnath: వైసీపీ వల్లే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగింది: అమర్ నాథ్

- ప్లాంట్ ప్రైవేటీకరణను తొలి నుంచి వైసీపీ వ్యతిరేకించిందన్న అమర్ నాథ్
- కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ అప్పులకే సరిపోతుందని వ్యాఖ్య
- ప్లాంట్ కు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని డిమాండ్
వైసీపీ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తొలి నుంచి కూడా తమ అధినేత జగన్ వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ అండగా నిలబడిందని తెలిపారు.
అప్పులు కూడా తీర్చలేని పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ ఉందని అమర్ నాథ్ చెప్పారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అప్పులకే సరిపోతుందని చెప్పారు.
వైజాగ్ సభలో మోదీ ప్యాకేజీని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్యాకేజీ వెనుక మతలబు ఏమిటని అడిగారు. స్టీల్ ప్లాంట్ కు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత గనులను కేటాయించాలని అన్నారు. ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.