Sunil Gavaskar: పాకిస్థాన్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి: గవాస్కర్

Pakistan has chances to win Champions Trophy says Sunil Gavaskar

  • వచ్చే నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
  • టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్
  • స్వదేశంలో పాక్ ను ఓడించడం అంత ఈజీ కాదన్న గవాస్కర్

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. ఈ టోర్నీలో ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన విశ్లేషణను అందించారు. 

ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ... పాకిస్థాన్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీలో హాట్ ఫేవరెట్ అనే ట్యాగ్ ను హోమ్ టీమ్ కే ఇవ్వాలని చెప్పారు. 

గత వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కు వెళ్లిన సంగతిని అందరూ గుర్తుంచుకోవాలని... ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ... వరుసగా మ్యాచ్ లు గెలుచుకుంటూ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు పాకిస్థాన్ కు కూడా అలాంటి అవకాశమే ఉందని చెప్పారు. స్వదేశంలో పాకిస్థాన్ ను ఓడించడం అంత సులభం కాదని అన్నారు. అందుకే పాక్ ను ఫేవరెట్ గా భావిస్తున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News