Chandrababu: ఎన్టీఆర్ ఒక పేరు కాదు.. ప్రభంజనం: చంద్రబాబు, లోకేశ్

Chandrababu pays tributes to NTR

  • ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన చంద్రబాబు
  • నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపారన్న బాబు
  • ఎన్టీఆర్ తెలుగువాడి విశ్వరూపం అన్న లోకేశ్

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ... నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆరే అని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అని కొనియాడారు. స్త్రీలకు సాధికారతను ఇచ్చిన సంస్కర్త అని అన్నారు. స్వర్గీయ తారక రామరావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడి స్మృతికి నివాళి అర్పిద్దామని చెప్పారు. 

మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... ఎన్టీఆర్ ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం అని అన్నారు. ఎన్టీఆర్ ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం అని చెప్పారు. వెండితెరపై రారాజుగా వెలుగొందారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారని చెప్పారు. కోట్లాది మంది హృదయాల్లో కొలువైన తన తాతగారే తనకు నిత్యస్ఫూర్తి అని అన్నారు. 

Chandrababu
Nara Lokesh
NTR
Telugudesam
  • Loading...

More Telugu News