Hero vishal: 12 ఏళ్ల క్రితం నేను నటించిన చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టింది... ఇదొక రికార్డు: విశాల్

- సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదలైన 'మద గజ రాజ' చిత్రం
- ఈ చిత్రం హిట్‌గా నిలవడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక రికార్డు అన్న హీరో విజయ్
- థియేటర్ల ముందు ప్రతి రోజు హౌస్ పుల్ బోర్డులు కనిపిస్తున్నాయన్న విజయ్
విశాల్ హీరోగా దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన చిత్రం 'మద గజ రాజ' సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదలైంది. అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. అయితే 12 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.
ఈ చిత్రంకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో చెన్నైలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో హీరో విశాల్ మాట్లాడుతూ .. 12 ఏళ్ల క్రితం తాను నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై, హిట్‌గా నిలవడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక రికార్డు అన్నారు. ఈ చిత్రం విజయోత్సవ వేడుక అనంతరం సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏదో ఒక రోజు మన సినిమా రిలీజ్ అయి వండర్స్ క్రియేట్ చేస్తుందంటూ 12 ఏళ్లుగా నాకు ధైర్యాన్ని ఇచ్చిన సుందర్ సర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల ముందు ప్రతి రోజు హౌస్ పుల్ బోర్డులు కనిపిస్తున్నాయని, ప్రశంసలు దక్కుతున్నాయని పేర్కొన్నారు. శనివారం చెన్నైలో నిర్వహించనున్న విజయ్ ఆంటోనీ లైవ్ కాన్సర్ట్‌లో ప్రేక్షకులు విశేషంగా ఆదరించిన 'మై డియర్ లవరూ' పాటను పాడనున్నట్లు విజయ్ తెలిపారు.