Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు... ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల వివరాలు ఇవిగో

tirumala srivari arjitha sevalu for april quota tokens issue dates

  • ఏప్రిల్ నెల ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
  • వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణం, శ్రీవారి టికెట్ల విడుదల తేదీల ప్రకటింపు
  • వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు జనవరి 23న విడుదల
  • ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా జనవరి 24న విడుదల  

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు జనవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ సేవా టికెట్లకు జనవరి 18 ఉదయం 10 గంటల నుండి జనవరి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తరువాత, టికెట్లు లక్కీడిప్ విధానంలో కేటాయించబడతాయి. లక్కీడిప్ ద్వారా ఎంపికైన భక్తులు జనవరి 20 నుండి జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్ చెల్లింపు పూర్తి చేయాలి.
 

ఆర్జిత సేవా టికెట్లు

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, అలాగే ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వసంతోత్సవాలకు సంబంధించిన టికెట్లు జనవరి 21 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.

వర్చువల్ సేవా టికెట్లు
ఏప్రిల్ నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్‌ల కోటాను జనవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
 
అంగ ప్రదక్షిణం టోకెన్లు
అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఏప్రిల్ కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
 
శ్రీవాణి ట్రస్టు టికెట్లు
శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో విడుదల చేసే టికెట్లను ఏప్రిల్ నెల కోటా జనవరి 23న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
 
వృద్ధులుదివ్యాంగుల దర్శన టోకెన్లు
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
 
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
 
తిరుమల
తిరుపతి గదుల కోటా
తిరుమల మరియు తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీవారి సాధారణ సేవ కోటాను జనవరి 27న ఉదయం 11 గంటలకు, శ్రీవారి నవనీత సేవ కోటాను జనవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు, శ్రీవారి పరాకామణి సేవ కోటా జనవరి 27న మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేస్తారు.   
 
బుకింగ్ కోసం సూచనలు
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, మరియు గదుల కోటాలను బుక్ చేసుకోవడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్  https://ttdevasthanams.ap.gov.in ను  మాత్రమే సందర్శించాలని టీటీడీ సూచించింది. భక్తులు నిర్దిష్ట తేదీలను గమనించి, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

  • Loading...

More Telugu News