Union Budget 2025-26: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

Parliamnet Budget Sessions will begin from Jan 31

  • ఈసారి రెండు విడతలుగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 
  • మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి నిర్వహించనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. 

బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 

ఇక, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

Union Budget 2025-26
Parliament
Lok Sabha
Rajya Sabha
NDA
India
  • Loading...

More Telugu News