Rinku Singh: ఎంపీని పెళ్లాడబోతున్న టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్?

- సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ ఎంగేజ్‌మెంట్ అంటూ పోస్టు
- అభిమానుల శుభాకాంక్షలు
- ఇటీవలే మచ్లిషహర్ లోక్ సభ స్థానం నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికైన ప్రియా
టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడా? ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌తో తాజాగా రింకూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. కాగా, ఎంగేజ్ మెంట్ కు సంబంధించి ఇటు రింకూ సింగ్ నుంచి గానీ, అటు ప్రియా సరోజ్ వైపు నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు.
కాగా, ప్రియా సరోజ్ ఇటీవల మచ్లిషహర్ లోక్ సభ స్థానం నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో చదివి సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పని చేశారు. ఇక రింకూ సింగ్ భారత జట్టు తరఫున టీ20ల్లో కీలక ప్లేయర్ అనే విషయం తెలిసిందే.
అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ ద్వారానే ఈ యంగ్ ప్లేయర్ వెలుగులోకి వచ్చాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.