KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో ఆడబిడ్డకు రూ.30 వేలు బాకీపడింది: కేటీఆర్

KTR says Revanth Reddy government not filfilled promises

  • రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం బాకీపడిందన్న కేటీఆర్
  • 100 రోజుల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని విమర్శ
  • కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని మండిపాటు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రూ.30,000 చొప్పున బాకీ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని విమర్శించారు.

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని విమర్శించారు. రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున బాకీ పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు, రైతులు నిలదీయాలన్నారు.

KTR
Revanth Reddy
Telangana
BRS
  • Loading...

More Telugu News