Jeevan Reddy: బీఆర్ఎస్ కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసింది: జీవన్ రెడ్డి

Jeevan Reddy fires on BRS

  • ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలవుతుందన్న జీవన్ రెడ్డి
  • షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని విమర్శ
  • రైతులకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వ్యాఖ్య

ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా రైతు దీక్ష అంటూ బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని చెప్పారు. తాము దీక్ష చేస్తేనే ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోందని చెప్పుకునే ప్రయత్నంలో ఉందని విమర్శించారు. 

రైతులకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని... బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసిందని చెప్పారు. బీజేపీకి అసలు రుణాలు మాఫీ చేసే సంస్కృతే లేదని విమర్శించారు. 

Jeevan Reddy
Congress
BRS
  • Loading...

More Telugu News