Fire Accident: ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

fire accident in Film Nagar reliance trends

  • రిలయన్స్ ట్రెండ్స్ నుంచి ఎగసిపడుతున్న మంటలు
  • మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • ఆస్తినష్టం భారీగానే ఉంటుందని అంచనా

హైదరాబాద్ ఫిలింనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా ఇక్కడ మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

రిలయన్స్ ట్రెండ్స్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో పెద్ద ఎత్తున జనాలు అక్కడ గుమికూడారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వల్ల ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లింది? ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్తినష్టం మాత్రం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.  

  • Loading...

More Telugu News