YS Jagan: లండన్ కింగ్స్ కాలేజీ నుంచి పట్టా అందుకున్న కుమార్తె వర్షారెడ్డి.. గర్వపడేలా చేశావన్న జగన్

You have made us proud passing with distinction Jagan

   


లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా పుచ్చుకున్న కుమార్తె వర్షారెడ్డికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. డిస్టింక్షన్‌లో పాసై తమను గర్వపడేలా చేశావని ఆనందం వ్యక్తం చేశారు. ‘గాడ్ బ్లెస్ యూ’ అని దీవిస్తూ భార్య భారతి ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, జగన్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఈ నెల 16న జరిగిన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం (స్నాతకోత్సవం)లో భార్యతో కలిసి పాల్గొన్నారు.

More Telugu News