Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కొడుకు గదిలోకి చొరబడి రూ.1 కోటి డిమాండ్ చేసిన దుండగుడు!

Police clarify if intruder entered Saif Ali Khan son room and demanded rs 1 crore

  • దొంగతనం కేసుగా నమోదు చేసిన పోలీసులు
  • కత్తి, కర్రతో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి జొరబడిన దుండగుడు
  • నిలకడగా సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు రూ.1 కోటి డిమాండ్ చేసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తోంది. ఇది దొంగతనం కేసుగా పోలీసులు పేర్కొన్నారు.

ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి గురువారం వేకువజామున జొరబడిన దుండగుడు నటుడిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడు ఇంట్లోకి జొరపడ్డాడు. కత్తి, కర్రను చేతపట్టుకొన్న దుండగుడు సైఫ్ కుమారుడు జెహ్ గదిలోకి ప్రవేశించి డబ్బు కోసం బెదిరించాడు. అతనిని గమనించిన సైఫ్ అలీఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా కత్తి, హెక్సా బ్లేడ్ లతో దాడి చేసి పారిపోయాడు.

ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు. వెన్నెముకలో వుండిపోయిన హెక్సా బ్లేడ్ ముక్కను తొలగించేందుకు ఆపరేషన్ చేశారు. 

  • Loading...

More Telugu News