Krishna water: కృష్ణా జలాల విషయంలో ట్రైబ్యునల్ కీలక నిర్ణయం

Brijesh Tribunal decesion on Krishna water

  • విభజన చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం వాదనలు వింటామన్న బ్రిజేష్ ట్రైబ్యునల్
  • 811 టీఎంసీలలో రెండు రాష్ట్రాల వాటాను తేల్చడం ముఖ్యమని వెల్లడి
  • ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామన్న బ్రిజేష్ ట్రైబ్యునల్

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు టర్మ్ ఆఫ్ రెఫరెన్స్‌పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై తొలుత వాదనలు వింటామని తెలిపింది.

811 టీఎంసీలలో రెండు రాష్ట్రాల వాటాను తేల్చడం ముఖ్యమని ట్రైబ్యునల్ పేర్కొంది. మూడో సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలకు కేటాయింపులపై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని తెలిపింది. ఆ తర్వాత 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

Krishna water
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News