Pattudala Trailer: అజిత్ 'పట్టుదల' మూవీ ట్రైలర్ రిలీజ్

Ajith Kumar starring Pattudala trailer released

  • అజిత్, త్రిష జంటగా విడా ముయార్చి
  • తెలుగులో పట్టుదల పేరుతో విడుదల
  • మగిళ్ తిరుమేని దర్శకత్వంలో చిత్రం
  • ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

అజిత్, త్రిష జంటగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పట్టుదల'. తమిళంలో ఇది విడా ముయార్చి పేరిట రూపుదిద్దుకుంటోంది. కాగా, ఈ హైఓల్టేజ్ యాక్షన్ మూవీ నుంచి నేడు ట్రైలర్ విడుదల చేశారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో పట్టుదల చిత్రాన్ని తెరకెక్కించారన్నది ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. పట్టుదల చిత్రం ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ చిత్రబృందం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే... అజిత్ స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పేప‌ర్ లుక్‌తో నెవ‌ర్ బిఫోర్ అవతార్‌లో మెప్పించ‌బోతున్నారు. ట్రైల‌ర్‌లో త‌న వాళ్ల కోసం అజిత్ విల‌న్స్‌తో చేస్తున్న పోరాటాలు, అజిత్‌, చార్మింగ్ బ్యూటీ త్రిష మ‌ధ్య కుదిరిన క్యూట్ కెమిస్ట్రీతో పాటు అజ‌ర్ బైజాన్‌లో చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అబ్బుర‌ప‌రుస్తున్నాయి. 

మ‌రో వైపు యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మ‌రోవైపు స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. రెజీనా క‌సాండ్ర సైతం ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి వైవిధ్య‌మైన పాత్ర‌లో అల‌రిస్తుంద‌ని ట్రైల‌ర్‌లో ఆమెను చూస్తుంటేనే అర్త‌మ‌వుతుంది. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌,  నిఖిల్ నాయ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

More Telugu News