BRS: కేటీఆర్ విచారణ... ఈడీ కార్యాలయం వద్ద పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్

BRS leaders arrested at ED office

  • ఉదయం నుంచి సాయంత్రం దాకా కేటీఆర్ విచారణ
  • ఈడీ కార్యాలయానికి చేరుకున్న పలువురు బీఆర్ఎస్ నేతలు
  • పోలీసుల అదుపులో మాగంటి గోపినాథ్, బాల్క సుమన్, ఆర్ఎస్పీ

ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈడీ అధికారులు ఈరోజు విచారించారు. ఉదయం 10.40 గంటలకు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఈ సమయంలో పలువురు బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చారు. పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని బీఆర్ఎస్ కేడర్‌కు సూచించారు. ఈడీ కార్యాలయం వైపు వచ్చే వాహనాలను కూడా పోలీసులు దారి మళ్లించారు.

  • Loading...

More Telugu News