Stock Market: స్టాక్ మార్కెట్లకు వరుసగా మూడో రోజు లాభాలు

- 318 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా లాభపడ్డ అదానీ పోర్ట్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్ల లాభంతో 77,042కి ఎగబాకింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,311కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (2.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.47%), భారతి ఎయిర్ టెల్ (1.46%), టాటా మోటార్స్ (1.43%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.87%), నెస్లే ఇండియా (-1.38%), ఇన్ఫోసిస్ (-1.21%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.15%), ఐటీసీ (-1.01%).