KCR: కేసీఆర్‌తో కలిసి... ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్ తనయుడు

Learning from the best Himanshu Rao tweets on KCR

  • పార పట్టి గుంతను తవ్వి చెట్టును నాటిన హిమాన్షు రావు
  • కేసీఆర్ సూచనలు ఇస్తుండగా చెట్టు నాటిన వైనం 
  • సహజ వనరులను సంరక్షించడం మన బాధ్యత అంటూ ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు తన తాత కేసీఆర్ తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటాడు. ఇందుకు సంబంధించిన 40 సెకన్ల వీడియోను అతను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

హిమాన్షు పారను పట్టుకొని గుంత తవ్వుతుండగా కేసీఆర్ పక్కనే నిలబడి సూచన చేస్తున్నారు. గుంతను తవ్వి, ఓ మొక్కను నాటి ఆ తర్వాత దానికి నీరు పోశాడు. ఆ తర్వాత అదే పారతో... చెట్టు నాటిన గుంతను మట్టితో నింపేశాడు. ఈ వీడియోకు 'లెర్నింగ్ ఫ్రమ్ ది బెస్ట్' అని కేసీఆర్‌ను ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చాడు. 

వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి చెట్లు పెంచడం ఎంతో అవసరమని, మన సహజ వనరులను రక్షించడం... సంరక్షించడం మన బాధ్యత అని ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేసి ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Telugu News