LTC: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Good News For Central Governament Employees About LTC

  • ఎల్టీసీతో ఇకపై ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించవచ్చు
  • వందే భారత్, హమ్ సఫర్, తేజస్ లలోనూ జర్నీ చేసే వీలు
  • ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కు కేంద్రం మరింత వెసులుబాటు కల్పించింది. తాజా ఆదేశాల ప్రకారం... ప్రీమియర్ రైళ్లలో అంటే వందే భారత్, తేజస్, హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లలోనూ ఎల్టీసీ కింద ప్రయాణించవచ్చు. ఈమేరకు కేంద్రం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇప్పటి వరకు ఎల్టీసీ కింద ప్రయాణించే ఉద్యోగులు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లలో ట్రావెల్ చేయడానికి అనుమతి ఉంది. వందే భారత్ సహా ప్రీమియర్ ట్రైన్స్ లో ఈ పథకం వర్తించదు.

అయితే, వివిధ ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల నుంచి వచ్చిన సూచనలు, విజ్ఞప్తులను పరిశీలించిన డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) తాజా నిర్ణయం తీసుకుంది. వందే భారత్ వంటి ప్రీమియర్ రైళ్లలోనూ ఎల్టీసీ కింద ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవుతో పాటు ప్రయాణ టికెట్లకు రీయింబర్స్ మెంట్ పొందుతారు.

LTC
Central govt
Premiur Trains
Vande Bharat
Tejas
  • Loading...

More Telugu News