Viral Videos: గోదారి గట్టు మీద సాంగ్ కు థియేటర్ లో ఓ జంట డ్యాన్స్... వీడియో ఇదిగో!

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ‘గోదారి గట్టు మీద రామచిలుకవే...’ సాంగ్ ఎంత హిట్టయిందో తెలిసిందే. ఈ సాంగ్ కు సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా కవర్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోలకు వేలు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడుతున్న థియేటర్ లో ఓ జంట చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ఆ పాట వస్తున్నపుడు ఓ యువతి, మరో యువకుడు తమ సీట్ల ముందున్న కొద్ది స్థలంలోనే సూపర్ గా డ్యాన్స్ చేశారు. అచ్చం వెంకీ మామ, ఐశ్వర్య రాజేశ్ చేసినట్టుగా డ్యాన్స్ చేసి ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధుల్ని చేశారు.
ఈ వీడియోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. ఇన్ స్టా అకౌంట్ వివరాల ప్రకారం... 'రూప ఈగో పిల్ల' అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో రూపతో పాటు డ్యాన్స్ చేసింది ఆమె తమ్ముడని తెలుస్తోంది.
కాగా, సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.