Banaganipalle: బనగానపల్లెలో టీడీపీ - వైసీపీ వర్గీయుల ఘర్షణ

Clash between TDP and YSRCP in Banaganipalle

  • వైసీపీ నేత ఫయాజ్ కుమారుడి వివాహం సందర్భంగా ఘర్షణ
  • వారి డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపై ఎగిరిందంటూ టీడీపీ వర్గీయుల ఆగ్రహం 
  • డ్రోన్ ఆపరేటర్ పై టీడీపీ శ్రేణుల దాడి

నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో అక్కడి వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేత ఫయాజ్ కుమారుడి వివాహంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు రచ్చ చేశారు. వివాహ వేడుకను డ్రోన్ ద్వారా షూట్ చేస్తున్న ఆపరేటర్ పై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫయాజ్ ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు మాజీ ఎమ్మెల్యే కాటసాని సిద్ధమయ్యారు. 

ఘర్షణ వివరాల్లోకి వెళితే... బీసీ జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలోనే ఫయాజ్ నివాసం ఉంది. ఫయాజ్ కుమారుడి పెళ్లి నేపథ్యంలో డ్రోన్ సాయంతో షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్ ఎగరడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేసి, డ్రోన్ ఆపరేటర్ పై దాడి చేశారు. దీంతో అక్కడ టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Banaganipalle
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News