KTR: రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న కేటీఆర్
- ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో ఆరోపణలు
- ఈ నెల 7న నోటీసులు జారీ చేసిన ఈడీ
- రేపు ఉదయం గం.10.30కు ఈడీ కార్యాలయానికి చేరుకోనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌కు హైకోర్టులో, ఈరోజు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ క్రమంలో ఆయన రేపు ఈడీ విచారణకు హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 7న ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో ఆయన రేపు ఉదయం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం గం.10.30లకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు.