Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం

Revanth Reddy and TG Congress leaders meeting in Delhi

  • కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన ముఖ్య నేతలు
  • కేసీ వేణుగోపాల్‌తో వివిధ అంశాలపై చర్చించిన నేతలు
  • ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని టీపీసీసీ చీఫ్ వెల్లడి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు.

దాదాపు గంటన్నర పాటు వీరు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వారు కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. మంత్రివర్గ విస్తరణ సహా ఇతర అంశాలపై వారు చర్చించారని తెలుస్తోంది.

ఫిబ్రవరిలో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ సభ సూర్యాపేట లేదా ఖమ్మంలో ఉండే అవకాశం ఉందన్నారు. జనవరి చివరి నాటికి నామినేటెడ్, కార్పోరేషన్ చైర్మన్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మంత్రి వర్గ విస్తరణపై సీఎం, పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించినట్లు చెప్పారు. ప్రజల్లో ఉండేవారికే డీసీసీ అధ్యక్ష పదవులు ఇస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News