Supreme Court: తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు జడ్జిలుగా ఆరుగురి పేర్లు సిఫార్సు చేసిన కొలీజియం
- తెలంగాణకు నలుగురి పేర్లు సిఫార్సు చేసిన కొలీజియం
- ఏపీ హైకోర్టుకు ఇద్దరి పేర్లు సిఫార్సు చేసిన కొలీజియం
- జ్యుడీషియల్ ఆఫీసర్ల కోటాలో సిఫార్సు చేసిన కొలీజియం
ఉభయ తెలుగు రాష్ట్రాలకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల కోటాలో తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరి పేర్లను సిఫార్సు చేసింది.
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ వై.రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ తిరుమలదేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టుకు జస్టిస్ హరిహరినాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు పేర్లను సిఫార్సు చేసింది. ఇదిలా ఉండగా, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సుజోయ్ పాల్‌ను నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు.