Mahesh Babu: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై మహేశ్ బాబు స్పందన
- 'సంక్రాంతికి వస్తున్నాం' అసలైన పండుగ సినిమా అన్న మహేశ్ బాబు
- వెంకటేశ్ యాక్టింగ్ అదిరిపోయిందని కితాబు
- అనిల్ రావిపూడిని చూస్తుంటే గర్వంగా ఉందని వ్యాఖ్య
వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాపై హీరో మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని బాగా ఎంజాయ్ చేశానని మహేశ్ బాబు తెలిపారు. ఇది అసలైన పండుగ సినిమా అని కితాబిచ్చారు. వెంకటేశ్ యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పారు. వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తుంటే సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు. ఐశ్యర్య రాజేశ్, మీనాక్షి చౌదరిల నటన సూపర్బ్ అని చెప్పారు. బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతంగా ఉందని అన్నారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.