Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి మాసాబ్ ట్యాంక్ పోలీసుల నోటీసులు
- రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
- రేపు కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని పోలీసులకు సమాధానం
- 17న విచారణకు హాజరవుతానన్న పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి మాసాబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే, తాను రేపు కరీంనగర్‌లో కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, ఎల్లుండి అంటే ఈ నెల 17న విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాధానం ఇచ్చారు.
బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మాసాబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ పరుశురాంను దర్యాఫ్తు అధికారిగా నియమించారు.