Shiva Reddy: ఆ వ్యక్తి ఎవరనేది అందరికీ తెలుసు: నటుడు శివారెడ్డి
- నటుడిగా పేరు తెచ్చుకున్న శివారెడ్డి
- మిమిక్రీ ఆర్టిస్టుగాను లభించిన క్రేజ్
- ఎన్నో కష్టాలు పడుతూ ఎదిగానని ఉద్వేగం
- ఆ ప్రచారంలో నిజం ఉందన్న శివారెడ్డి
శివారెడ్డి .. ఒకప్పుడు నటుడిగా .. మిమిక్రీ ఆర్టిస్టుగా తాను చాలా బిజీ. కానీ ఆ తరువాత కాలంలో సినిమాలలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అందుకు ఒక స్టార్ కమెడియన్ కారణమనే టాక్ చాలా కాలంగా వినిపిస్తూ వస్తోంది. అప్పటి నుంచి కూడా శివారెడ్డి స్టేజ్ షోస్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మా ఫాదర్ పోయిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాను. చిన్నా చితకా పనులు చాలానే చేశాను. ఎప్పటికైనా సరే మా అమ్మను బాగా చూసుకోవాలి .. మా బంధువుల ముందర తలెత్తుకు తిరగాలి అనుకునేవాడిని. అందుకోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ వెళ్లాను. ఎక్కడికైనా సరే లిఫ్ట్ అడుగుతూనే వెళ్లేవాడిని. ఇక్కడ సింపుల్ గా కనిపిస్తే ఒకలా అనుకుంటారు .. కాస్త గొప్పగా కనిపిస్తే మరోలా అనుకుంటారు. నేను మాత్రం నా వ్యక్తిత్వానికి తగినట్టుగానే ఉంటాను" అని అన్నారు.
"నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరనేది అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు? అనేది ఇంతకాలమైనా నేను ఎక్కడా చెప్పలేదు .. అది నా మంచితనానికి నిదర్శనం. ఆ వ్యక్తికి సంబంధించిన ఆ సంఘటన 2009లో జరిగింది. ఆ రోజున నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఆ తరువాత చాలా కాలం పాటు స్టేజ్ షోస్ చేస్తూ వెళ్లాను. నాకు అవకాశాలు తగ్గినా ఫోన్ చేసి అడిగినవాళ్లెవరూ లేరు" అని చెప్పారు.