Manchu Manoj: మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్లు

Mohan Babu and Manchu Manoj attacks each other

  • యూనివర్శిటీ లోపలకు వెళ్లేందుకు మనోజ్ యత్నం
  • అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
  • తాత, నానమ్మ సమాధులు చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్న
  • ఆ తర్వాత మనోజ్ దంపతులను అనుమతించిన పోలీసులు
  • సమాధులకు దండం పెట్టుకుని బయటు వచ్చిన మనోజ్

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ప్యామిలీ రచ్చ రోజురోజుకూ ముదురుతోంది. ఈరోజు మరోసారి యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ వద్దకు వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తన తాత, నానమ్మ సమాధులను చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్శిటీ లోపలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 

ఈ క్రమంలో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవపడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. 

తనకు గొడవ చేసే ఉద్దేశం లేదని... అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మనోజ్ ప్రశ్నించారు. లోపలకు పంపిస్తే సమాధులకు దండం పెట్టుకుని వచ్చేస్తానని చెప్పారు. ఉద్రిక్తతల మధ్యే పోలీసులు మనోజ్ ను, ఆయన భార్య మౌనికను లోపలకు పంపించారు. సమాధులకు దండం పెట్టుకున్న మనోజ్ దంపతులు యూనివర్శిటీ నుంచి బయటకు వచ్చేశారు.

  • Loading...

More Telugu News