Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

- 224 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 37 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4.36 శాతం పెరిగిన జొమాటో
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే బాటలో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 76,724 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 23,213 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జొమాటో (4.36%), ఎన్టీపీసీ (3.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.03%), కొటక్ బ్యాంక్ (2.29%), మారుతి (1.69%).
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.91%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.27%), బజాజ్ ఫైనాన్స్ (-2.16%), యాక్సిస్ బ్యాంక్ (-2.14%), టాటా మోటార్స్ (-0.93%).