IND Women vs IRE Women: భారత మహిళా జట్టు విధ్వంసం.. వన్డే చరిత్రలో రికార్డు స్కోరు నమోదు!
- రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్, భారత్ మధ్య మూడో వన్డే
- 50 ఓవర్లలో ఏకంగా 435 రన్స్ చేసిన టీమిండియా
- సెంచరీలతో చెలరేగిన ప్రతీకా రావల్ (154), స్మృతి మంధాన (135)
- వన్డేల్లో భారత మహిళా జట్టుకు ఇదే అత్యధిక స్కోర్
రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్ మహిళా జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 435 రన్స్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ప్రతీకా రావల్ (154), స్మృతి మంధాన (135) సెంచరీలు బాదారు. అలాగే రిచా ఘోశ్ 59, తేజల్ 28, హర్లీన్ 15 పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2 వికెట్లు తీయగా... ఫ్రేయా, కెల్లీ, డెంప్సీ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక వన్డేల్లో భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా మహిళల వన్డే క్రికెట్‌లో నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో న్యూజిలాండ్ మహిళా జట్టు వరుసగా 491/4, 455/5, 430/3 స్కోర్లు చేసింది.