Akhilesh Yadav: ఢిల్లీలో కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బలం ఉంది: అఖిలేశ్ యాదవ్

Standing with AAP in Delhi polls says Akhilesh Yadav

  • ఆమ్ ఆద్మీ పార్టీకే కూటమి మద్దతివ్వాలన్న అఖిలేశ్ యాదవ్
  • బీజేపీని ఓడించడమే కూటమి లక్ష్యమన్న అఖిలేశ్
  • అఖిలేశ్ మాటలతో ఏకీభవిస్తున్నామన్న తృణమూల్ నేత

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలం ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతివ్వడం బాగుంటుందని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేసే సమయంలో కూటమిలోని అన్ని పార్టీలు కలిసి ఏం నిర్ణయం తీసుకున్నాయో ఓసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని సూచించారు. ప్రత్యర్థి బీజేపీని ఓడించేందుకు అవకాశం ఉన్న ప్రతిచోట ప్రాంతీయ పార్టీలకు మద్దతివ్వాలని కూటమి చేసిన ఒప్పందం ఏమైందని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉందని, కాబట్టి ఇండియా కూటమి నేతలు ఆ పార్టీకి మద్దతిస్తేనే బాగుంటుందన్నారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ కంటే కేజ్రీవాల్ పార్టీకే అధిక బలం ఉందన్నారు. బీజేపీని ఓడించడమే కూటమి లక్ష్యమని గుర్తు చేశారు.

మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కూడా ఈ అంశంపై స్పందించారు. అఖిలేశ్ యాదవ్ మాటలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమిని ఏర్పాటు చేసిన సమయంలో తీసుకున్న నిర్ణయాలను పాటించాలని సమాజ్‌వాది, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News