Hyderabad: చైనీస్ మాంజాపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు
- చైనీస్ మాంజాను స్థానికంగా తయారు చేస్తున్నారన్న సీపీ
- అందుకే సులభంగా లభ్యమవుతోందని వెల్లడి
- ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తుందని వ్యాఖ్య
చైనీస్ మాంజాపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనీస్ మాంజా వల్ల అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలో సీపీ మాట్లాడుతూ... చైనీస్ మాంజాను స్థానికంగా కూడా తయారు చేస్తున్నారని, అందుకే చాలా సులభంగా లభ్యమవుతోందన్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తోందన్నారు.
త్వరలో ఈ-కామర్స్ గోదాముల్లో సోదాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నిర్వాహకులతోనూ సమావేశమవుతామని తెలిపారు. చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. అప్పుడే చైనీస్ మాంజా వినియోగం తగ్గుతుందన్నారు.