Devika: ఆమె నన్ను ఒక శత్రువులా చూసేది: నటి దేవిక భర్త దేవదాస్!

Devadas Interview

  • 1950 - 60 దశకాలలో నాయికగా దేవిక 
  • తమ వివాహ బంధం నిలబడలేదన్న భర్త 
  • కూతురికి కూడా తనపై ప్రేమ లేదని ఆవేదన 
  • 32 ఏళ్లపాటు కోర్టు చుట్టూ తిరిగామని వెల్లడి


1950 - 60లలో అందాల కథానాయికగా దేవిక ఒక వెలుగు వెలిగారు. ఒక వైపున సావిత్రి - జమున - కృష్ణకుమారి వంటి టాప్ హీరోయిన్స్ నుంచి పోటీని తట్టుకుంటూ ఆమె నిలబడ్డారు. ఎన్టీఆర్ .. కాంతారావు వంటి కథానాయకులతో పౌరాణిక .. జానపద చిత్రాలు చేశారు. అలాంటి దేవిక 2002లో చనిపోయారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె భర్త దేవదాస్ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక చిన్న రూమ్ లో ఉంటున్నప్పుడు .. నా జీతం నెలకి 200 ఉన్నప్పుడు దేవిక నన్ను ప్రేమించింది. పెళ్లి చేసుకుందామని కోరింది ఆమెనే. మన మధ్య చాలా విషయాలలో వ్యత్యాసాలు ఉన్నాయి ..  మనకు కుదరదు అని నేను చెప్పాను కూడా. పెళ్లి చేసుకున్న తరువాత 6 .. 7 ఏళ్లు కలిసి ఉన్నావేమో. 'కనక' పుట్టిన తరువాత మా మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. దాంతో విడాకులు తీసుకుని విడిపోయాము" అని అన్నారు. 

" దేవిక కెమెరా ముందు మాత్రమే కాదు .. ఫ్యామిలీలోను నటించేది. నన్ను ఓ శత్రువులా చూసేది .. ఒకానొక సందర్భంలో తాళి తీసి విసిరేసింది. 32 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగాము. ఒక భర్తగా .. తండ్రిగా నేను ఫెయిల్యూర్. అందుకు కారణం కూడా ఆమెనే. నాపై నా కూతురికి బ్యాడ్ గా చెప్పేది. అందువలన నా కూతురు నన్ను పట్టించుకోదు. నా కూతురు కూడా ఆస్తి కోసం నాపై కేసులు పెట్టింది. దేవిక చనిపోయినప్పుడు కూడా నేను వెళ్లలేదు" అని చెప్పారు.

  • Loading...

More Telugu News