Smriti Mandhana: రికార్డు సృష్టించిన స్మృతి మంధాన... తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఘనత!
- రాజ్‌కోట్ వేదికగా భారత్, ఐర్లాండ్ మూడో వన్డే
- ఆకాశమే హద్దుగా చెలరేగిన స్మృతి మంధాన
- వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డేల్లో అరుదైన రికార్డు సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుకెక్కారు. కేవలం 70 బంతుల్లోనే ఆమె శతకం సాధించారు. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆమె ఈ ఘనత సాధించారు.
ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ సింగ్ (87 బంతులు) పేరిట ఉండేది. కాగా, వన్డేల్లో స్మృతికి ఇది పదో సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచులో ఆమె 80 బంతుల్లో 7 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తొలి వికెట్‌కు ప్రతీక రావల్‌తో కలిసి స్మృతి రికార్డు స్థాయిలో 233 పరుగుల భాగస్వామ్యం అందించారు.