KTR: కేటీఆర్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

KTR Quash Petition Rejected In Supreme Court

  • హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు
  • క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కేటీఆర్
  • ఫార్ములా ఈ రేసు కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ మాజీ మంత్రి పిటిషన్

సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. బుధవారం ఉదయం కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని చెబుతూ హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ మీకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా? అంటూ కేటీఆర్ తరఫు న్యాయవాదికి గుర్తుచేసింది. దీంతో క్వాష్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కేటీఆర్ న్యాయవాది కోరగా.. సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. దీంతో కేటీఆర్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని కేటీఆర్ పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టి వేయాలంటూ కేటీఆర్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం విచారించిన సుప్రీం ధర్మాసనం ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. 

More Telugu News