Sankranthiki Vasthunnam: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..!
- వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం
- సంక్రాంతి కానుకగా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా
- ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 45కోట్ల గ్రాస్ వసూళ్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.
వెంకీకి ఇవే ఆల్‌టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ కలిసి దీనిని నిర్మించారు.