Indian Navy: నేవీలోకి 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి

PM Narendra Modi commissions Three WarShips in Mumbai

  • ముంబైలో భారత నావికాదళ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
  • మూడు నౌకలను జాతికి అంకితం చేసిన మోదీ
  • దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమమని వెల్లడి.. నేవీ సిబ్బందికి అభినందనలు

భారత దేశ చరిత్రలో మూడు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే ప్రప్రథమమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బుధవారం మహారాష్ట్రలోని ముంబై డాక్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు యుద్ధ నౌకలు, ఫ్రాన్స్ సహకారంతో అభివృద్ధి చేసిన జలాంతర్గామిని మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక విధ్వంసక నౌకలలో ఒకటిగా ఐఎన్ఎస్ సూరత్ నిలవనుందని ఆయన పేర్కొన్నారు.

పీ 17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక ఐఎన్ఎస్ నీలగిరిని, పీ75 కింద రూపొందించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్ షీర్ లను మోదీ ప్రారంభించారు. వీటి రాకతో భారత నావికాదళం మరింత బలపడిందని చెప్పారు. యుద్ధ నౌకల అభివృద్ధిలో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉందని చెప్పారు. జలాంతర్గామిని ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి చేశామని ప్రధాని వివరించారు. ఈ మూడింటినీ భారత దేశంలోనే తయారుచేశామన్నారు. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారబోతోందని, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ లక్ష్యంగా పనిచేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

ఐఎన్ఎస్ వాఘ్ షీర్..

ఐఎన్ఎస్ నీలగిరి..

More Telugu News