Game Changer: టీవీల్లో 'గేమ్ ఛేంజర్'.. ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ నిర్మాత
- ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్న 'గేమ్ ఛేంజర్'
- లోకల్ టీవీ ఛానల్లో పైరసీ హెచ్‌డీ ప్రింట్‌ను ప్రసారం చేస్తున్నారని నెటిజన్ల ఫిర్యాదు
- ఇది ఏమాత్రం మంచిది కాదన్న నిర్మాత శ్రీనివాస్ కుమార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి లోకల్ టీవీ ఛానల్లో పైరసీ హెచ్‌డీ ప్రింట్‌ను ప్రసారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.
దీనిపై టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ (ఎస్‌కేఎన్) స్పందించారు. ఇది ఏమాత్రం మంచిది కాదని, ఇలా జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది ఏళ్లతరబడి కష్టపడితే ఒక సినిమా రూపుదిద్దుకుంటుందని, అలాంటిది ఇలా సింపుల్‌గా చిత్రాన్ని బయటపెట్టడం ఏంటని? ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని తెలిపారు. కాగా, ఈ సినిమా విడుదలకు ముందే కుట్రలు జరిగాయని చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.