Kangana Ranaut: కంగనా రనౌత్ సినిమాను బ్యాన్ చేయనున్న బంగ్లాదేశ్?

Bangladesh to ban Kangana Ranut movie Emergency

  • ఈ నెల 17న విడుదల కానున్న కంగన చిత్రం 'ఎమర్జెన్సీ'
  • ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో సినిమా
  • ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించిన కంగన

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఆ సినిమాకు తనే దర్శకత్వం కూడా వహించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం... ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 

ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషించగా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్ పేయి పాత్రలో శ్రేయస్ తల్పాడే కనిపించనున్నారు.

మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలనే యోచనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత... భారత్ - బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఎమర్జెన్సీ' మూవీని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News