Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ కి 50 ఏళ్లు... ప్రత్యేక వీడియో పోస్ట్ చేసిన నాగార్జున
- 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ప్రారంభమైన అన్నపూర్ణ స్టూడియోస్
- 50 ఏళ్ల అద్భుతమైన రోజును జరుపుకుంటున్నామన్న నాగార్జున
- అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలన్న నాగ్
హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయింది. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ఈ స్టూడియోస్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'50 ఏళ్ల క్రితం తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కలలు సాకారమయ్యే ప్రదేశాన్ని ఊహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ప్రారంభమయింది. ఈ రోజు మనం 50 సంవత్సరాల అద్భుతమైన రోజును జరుపుకుంటున్నాం. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు' అని నాగార్జున చెప్పారు.