Maharashtra: పార్కింగ్ సమస్యకు విరుగుడు.. కార్ల అమ్మకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం

Maharashtra key decision on cars sales

  • మహారాష్ట్రలో పలు నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య
  • ఇకపై పార్కింగ్ ఉన్న వాళ్లకే కార్లను విక్రయించాలనే నిబంధన తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • కార్లు కొనేవాళ్లు పార్కింగ్ కు సంబంధించిన పత్రాలను సమర్పించాలన్న రవాణా మంత్రి

రాష్ట్రంలో వాహనాల రద్దీ ఎక్కువవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. కార్లు కొనేవారు తమకు పార్కింగ్ స్థలం ఉన్నట్టు సంబంధిత పత్రాలను అందించాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు. 

జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని ప్రతాప్ సర్నాయక్ అన్నారు. పలు అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న వారికి తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల వాళ్లు కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారని... దీనివల్ల పార్కింగ్ సమస్య ఎక్కువవుతోందని చెప్పారు. అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని తెలిపారు. అందుకే పార్కింగ్ ఉన్నవారికే కార్లను విక్రయించాలనే నిబంధనను తీసుకొస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News