Chandrababu: కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది: చంద్రబాబు
- కనుమ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
- కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలన్న చంద్రబాబు
- పశువులను పూజించే పండుగ కనుమ అన్న లోకేశ్
కనుమ పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. "రాష్ట్ర ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అని ట్వీట్ చేశారు.
"తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుమ. రైతన్నలు ఏడాది పొడవునా తమ కష్టంలో పాలుపంచుకునే పశువులను పూజించే పండుగ కనుమ. మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడిపంటలతో పచ్చగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబసభ్యులంతా కలిసి గొప్పగా జరుపుకోవాలి. ఈ కనుమ పండుగ మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు" అని తెలిపారు.