Nara Lokesh: నారా లోకేశ్ స్పెషల్ గిఫ్ట్.. రిప్లై ఇచ్చిన అర్ధాంగి బ్రాహ్మణి
- సంక్రాంతి కానుకగా బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను గిఫ్ట్‌గా ఇచ్చిన లోకేశ్
- మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతమని, వారికి అండగా నిలుద్దామని లోకేశ్ ట్వీట్
- లోకేశ్ ఇచ్చిన ప్రత్యేక బహుమతిపై 'ఎక్స్' వేదికగా బ్రాహ్మణి స్పందన
- మంగళగిరి చేనేత చీర నిజంగా అద్భుతంగా ఉందని రిప్లై
ఏపీ మంత్రి నారా లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అందజేశారు. మంగళగిరిలో తయారు చేసిన చేనేత చీరను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతమని, వారికి అండగా నిలుద్దామని లోకేశ్ ట్వీట్ చేశారు.
"ఈ సంక్రాంతికి బ్రాహ్మణికి ప్రత్యేక మంగళగిరి చీరను బహుమతిగా ఇవ్వడం గౌరవంగా ఉంది. మా మంగళగిరి చేనేత వస్త్రాల అందం, చేతిపని నిజంగా సాటిలేనివి. ఈ గొప్ప వారసత్వాన్ని సజీవంగా ఉంచే మా నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులకు మద్దతుగా నిలువడాన్ని కొనసాగిద్దాం" అని లోకేశ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఇక భర్త నారా లోకేశ్ ఇచ్చిన ప్రత్యేక బహుమతిపై బ్రాహ్మణి స్పందించారు. మంగళగిరి చేనేత చీర అద్భుతంగా ఉందని రిప్లై ఇచ్చారు. "థ్యాంక్యూ లోకేశ్.. ఈ మంగళగిరి చీర నిజంగా అద్భుతంగా ఉంది. ఈ సంప్రదాయం, చేతపని చాలా గొప్పవి. మన ప్రతిభావంతులైన నేత కార్మికుల పనిని ధరించడం ఒక అదృష్టం. అందరికీ సంతోషం, శ్రేయస్సుతో నిండిన సంక్రాంతి శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వారి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.