Kallakkadal: కేరళ, తమిళనాడు తీరాలకు నేటి రాత్రి ఉప్పెన ముప్పు.. హెచ్చరికల జారీ

INCOIS Warns Kallkkadal To Kerala And Tamil Naddu

  • రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ ముప్పు పొంచి ఉందని ఐఎన్‌సీవోఐఎస్ హెచ్చరిక
  • రాత్రి 11.30 గంటలకు తీరంలో అలల తాకిడి భారీగా ఉంటుందన్న అధికారులు
  • ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని సూచన
  • మళ్లీ ప్రకటన చేసే వరకు బీచ్‌ల వద్దకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు

కేరళ, తమిళనాడు తీరాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ (సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు) ముప్పు పొంచి ఉందని, నేటి రాత్రి సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో మీటరు వరకు అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీవోఐఎస్) హెచ్చరికలు జారీచేసింది. 

తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, చిన్నచిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలను రాత్రి లోగా తీరానికి చేర్చుకోవాలని సూచించింది. మళ్లీ ప్రకటన చేసే వరకు వరకు పర్యాటకులు ఎవరూ బీచ్‌ల వద్దకు రావొద్దని పేర్కొంది.

More Telugu News