sankranthiki vasthunam: ఈ వైబ్ మాకు ముందే అర్థమైంది: దిల్ రాజు

- వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా
- సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్రబృందం
- బ్లాక్ బస్టర్ పొంగల్ అనే రిపోర్ట్స్ వచ్చేశాయన్న దిల్ రాజు
టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీశ్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీశ్ తదితరులు సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ప్యాక్డ్ థియేటర్స్‌లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా ఉంటుందన్నారు.
‘అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి ఈ సినిమాకి వస్తున్న వైబ్ మాకు అర్ధమైయింది. ఆడియన్స్ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారని తెలిసింది. అమెరికా నుంచి అమలాపురం, ఆస్ట్రేలియా నుంచి అనకాపల్లి.. ఇలా షోలు పూర్తయిన వెంటనే బ్లాక్ బస్టర్ పొంగల్ అనే రిపోర్ట్స్ వచ్చేశాయి. సినిమాలో నాన్ స్టాప్‌గా నవ్వులు ఎంజాయ్ చేస్తున్నారు. మా కాంబినేషన్‌లో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఎఫ్ 2 ని వారంలో సింపుల్‌గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్‌కి, వెంకటేశ్ కి, హీరోయిన్స్‌కి, ప్రేక్షకులందరికీ థాంక్స్. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. కచ్చితంగా థియేటర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్యాక్డ్ థియేటర్స్‌లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా వుంటుంది' అని దిల్ రాజు అన్నారు.